వార్తలకు తిరిగి వెళ్లండి
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లోకి 'జెరోధా'.. సెబీ అనుమతి కోసం దరఖాస్తు
కిషోర్ కుమార్ Jun 29, 2026 6:15 AM అల్ ఇండియా 0 viewsabout 4 hours ago

భారతదేశపు అతిపెద్ద బ్రోకింగ్ సంస్థల్లో ఒకటైన 'జెరోధా', ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం మర్చంట్ బ్యాంకింగ్ లైసెన్స్ కోరుతూ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)కి దరఖాస్తు చేసుకుంది.
ఈ లైసెన్స్ లభిస్తే జెరోధా కేవలం బ్రోకింగ్ కే పరిమితం కాకుండా ఐపీఓ (IPO)లు, రైట్స్ ఇష్యూలు వంటి మూలధన మార్కెట్ లావాదేవీలను నిర్వహించే అవకాశం లభిస్తుంది.
Comments
Loading comments...