Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మ్యూచువల్ ఫండ్స్ ఫీజులపై జెరోదా, గ్రో మధ్య వివాదం

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 10, 2026 2:07 PM జాతీయంబిజినెస్
మ్యూచువల్ ఫండ్స్ ఫీజులపై జెరోదా, గ్రో మధ్య వివాదం - Udayam
మ్యూచువల్ ఫండ్స్ ట్రేడింగ్ చార్జీల విధానాలపై దేశీయ ప్రముఖ బ్రోకరేజీ ప్లాట్‌ఫామ్‌లు జెరోదా, గ్రోల మధ్య బహిరంగ వాగ్వాదం నెలకొంది. ఇన్వెస్టర్ల పెట్టుబడితో సంబంధం లేకుండా స్థిరమైన ఫీజులు ఉండాలని జెరోదా సీఈఓ నితిన్ కామత్ అభిప్రాయపడ్డారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినంత మాత్రాన ట్రేడింగ్‌లో అదనపు శ్రమ ఉండదని, అలాంటప్పుడు వేర్వేరు రుసుములు వసూలు చేయడం సరికాదన్నారు. దీనిపై గ్రో సంస్థ కూడా ధీటుగా స్పందించింది.

Comments

G
Loading comments...