Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువ న్యాయవాది మృతి.. వైద్యులపై ఆరోపణలు

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 9:21 AM హైదరాబాద్General
యువ న్యాయవాది మృతి.. వైద్యులపై ఆరోపణలు - Udayam
సికింద్రాబాద్‌లోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువ న్యాయవాది ఐశ్వర్య (28) మృతి చెందినట్లు సమాచారం. కిడ్నీలో రాళ్ల చికిత్స కోసం ఈ నెల 6న చేరిన ఆమెకు అనవసర శస్త్రచికిత్స చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్యం క్షీణించి బ్రెయిన్‌డెడ్‌కు గురైనట్లు ఆస్పత్రి తెలిపింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు, న్యాయవాదులు ఆందోళన చేపట్టి చర్యలు కోరారు.

Comments

G
Loading comments...