వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ బయో డైవర్సిటీ ఛైర్మన్ నీలాయపాలెం విజయ్‌కుమార్ మాట్లాడుతూ, డీఎస్సీపై వైకాపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కేవలం దుష్ప్రచారమేనని మండిపడ్డారు. ఐదేళ్ల తమ పాలనలో ఉద్యోగాల ఊసే ఎత్తని వారు, ఇప్పుడు యువతను గందరగోళానికి గురిచేసేలా మాట్లాడటం సరికాదని ఆయన హితవు పలికారు.
వైకాపా నాయకుల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. నోటిఫికేషన్లు ఇవ్వని పార్టీకి మాట్లాడే హక్కు లేదని విమర్శించిన విజయ్‌కుమార్, యువత భవిష్యత్తును రాజకీయాలతో ముడిపెట్టడం ఆపాలన్నారు.
Comments
Loading comments...

