Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమావాస్య వేళ శ్రీశైలంలో భక్తుల రద్దీ

Follow Udayam on Google
Ravi Jun 15, 2026 12:08 PM నంద్యాలGeneral
అమావాస్య వేళ శ్రీశైలంలో భక్తుల రద్దీ - Udayam
అమావాస్య సందర్భంగా శ్రీశైల క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన సేవలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. స్పర్శదర్శనం టికెట్లు పొందిన భక్తులకు రెండు విడతలుగా దర్శన సౌకర్యం కల్పిస్తున్నారు. భక్తులందరూ సహకరించాలని అధికారులు కోరారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...