వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరుకు చెందిన ఓ యువ జంట సముద్ర మార్గంలో అరుదైన ఘనత సాధించింది. కేవలం 10 గంటల 45 నిమిషాల్లో శ్రీలంక నుండి భారత్‌కు ఈదుతూ చేరుకుని సరికొత్త రికార్డు సృష్టించారు. పాక్ జలసంధిలో ఎదురైన అలలు, కష్టతరమైన వాతావరణాన్ని అధిగమించి ఈ అద్భుతమైన సాహసాన్ని పూర్తి చేశారు.
ఇలా జంటగా సముద్రాన్ని ఈది రికార్డు సృష్టించడం ఇదే మొదటిసారి. వీరి సాహసయాత్రను పలువురు అభినందిస్తున్నారు. కఠినమైన శిక్షణ, పట్టుదలతోనే ఈ విజయం సాధ్యమైందని ఆ జంట సంతోషం వ్యక్తం చేసింది. ఈ అరుదైన విజయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Loading comments...

