వార్తలకు తిరిగి వెళ్లండి

ఫాస్టాగ్ రీచార్జ్ కోసం ప్రయత్నించిన ఓ వ్యక్తి సైబర్ కేటుగాళ్ల వలలో పడి భారీగా నష్టపోయాడు. గూగుల్‌లో దొరికిన నకిలీ కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేయగా, వారు పంపిన లింక్ క్లిక్ చేయడంతో క్షణాల్లోనే ఫోన్ హ్యాక్ అయ్యింది. చూస్తుండగానే బ్యాంకు ఖాతాలోని నగదు మాయమవడంతో బాధితుడు షాక్‌కు గురయ్యాడు.
అపరిచిత లింక్స్‌పై క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేవలం అధికారిక యాప్స్ ద్వారానే రీచార్జ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల డిజిటల్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి.
Comments
Loading comments...

