వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. మేజిక్ ఫిగర్ 118కి చేరువలో ఉన్న విజయ్ నేతృత్వంలోని టీవీకేకు కాంగ్రెస్ (5), లెఫ్ట్ పార్టీల (CPI, CPM) మద్దతు లభించింది. దీంతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్.. విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.
ఒక్కగా వెళ్లిన ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించి ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. త్వరలోనే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దశాబ్దాల ద్రవిడ రాజకీయాల గుత్తాధిపత్యానికి తెరదించుతూ విజయ్ సృష్టించిన ఈ విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...

