వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్రతీరంలో సోమవారం ‘యోగాంధ్ర’ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వినూత్న వేడుకలో జిల్లా కలెక్టర్ రాజాబాబుతో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల యోగాసనాలు వేశారు.
రోజుకు ఒక గంట పాటు యోగా సాధన చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని పతాంజలి గురువులు, శిక్షకులు ఈ సందర్భంగా వివరించారు. మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

