Back to feed
వ్యాన్ ఢీకొని మహిళ దుర్మరణం
Suresh Jun 11, 2026 10:18 AM తూర్పుగోదావరి 5 views4 days ago

తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి జంక్షన్ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక వ్యాన్ బైకును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న మహిళ తలపై నుంచి వ్యాన్ దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ నడుపుతున్న వ్యక్తి సురక్షితంగా బయటపడగా, పోలీసులు కేసు నమోదు చేసి మృతురాలి వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...

