వార్తలకు తిరిగి వెళ్లండి

పుంగనూరు పాత బస్టాండు సమీపంలోని విరూపాక్షి మారెమ్మ ఆలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి, వేపాకులు, పుష్పాలతో విశేషంగా అలంకరించారు.
ప్రత్యేక అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

