వార్తలకు తిరిగి వెళ్లండి

వై.రామవరం శాఖ గ్రంథాలయానికి మరమ్మతులు చేయించేందుకు కృషి చేస్తానని గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఈశ్వర భూపతిరాజు వర్మ హామీ ఇచ్చారు. గురువారం ఆయన గ్రంథాలయాన్ని సందర్శించగా, స్లాబ్ పాడై వర్షం వస్తే నీరు లీకవుతోందని పాఠకులు తెలిపారు.
మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపిస్తామని, గ్రంథాలయంలో సదుపాయాలు కల్పిస్తామని ఛైర్మన్ పేర్కొన్నారు. కార్యదర్శి ఎల్. కుమారి, లైబ్రేరియన్ సత్యవతి పాల్గొన్నారు.
Comments
Loading comments...

