Udayam Digital
Menu

వైకాపా నేత ఇంట్లో మద్యం పట్టివేత

Shruthi Nov 23, 2026 7:04 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
వైకాపా నేత ఇంట్లో మద్యం పట్టివేత - Udayam Digital
పంచాయతీ ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు అక్రమంగా నిల్వచేసిన 1,341 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం కొండూరులో వైకాపా నాయకుడు తోట నరేష్‌ తన ఇంట్లో వీటిని నిల్వచేశారు. సీఐ పి.శ్రీను ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు నరేష్‌తో పాటు అద్దంకి ఆంజనేయులును అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఇద్దరికీ రిమాండ్‌ విధించారు.

Comments

G
Loading comments...