Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాట్సాప్ మెసేజ్‌లతో అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 11:47 AM నిజామాబాద్General
వాట్సాప్ మెసేజ్‌లతో అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై - Udayam
సిరికొండ మండల ప్రజలు బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అయినట్లు వచ్చే గుర్తుతెలియని వాట్సాప్ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై రామకృష్ణ సూచించారు. లావాదేవీ చేయకపోతే ‘NO’ అని రిప్లై ఇవ్వాలని కోరే మెసేజ్‌లకు స్పందించవద్దన్నారు. బ్యాంకు అధికారిక యాప్‌లో లావాదేవీల వివరాలను తనిఖీ చేసుకోవాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్సై తెలిపారు.

Comments

G
Loading comments...