వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్నూర్ మండలం హర్కాపూర్ సమీపంలోని ఎక్స్‌రోడ్ ప్రధాన రహదారిపైకి వాలిన చెట్ల కొమ్మలతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వాహనాల రాకపోకలకు ఆటంకం కలగడంతో పాటు కొమ్మలు విరిగిపడతాయనే భయం నెలకొంది.
సమస్యను సర్పంచ్ అనిత శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె స్పందించారు. శుక్రవారం జేసీబీ సాయంతో కొమ్మలను తొలగించడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

