వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ నుండి ఎగుమతయ్యే సరుకులపై 12.5 శాతం అదనపు సుంకాలు విధించాలని అమెరికా యోచిస్తోంది. ఉత్పత్తుల తయారీలో బలవంతపు శ్రమశక్తి వినియోగాన్ని అరికట్టడంలో విఫలమైన 60 దేశాల జాబితాలో భారత్ కూడా ఉందని అమెరికా వాణిజ్య ప్రతినిధుల బృందం ఓ నివేదికలో పేర్కొంది.
దీనిపై ఇరుదేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇది తుది నిర్ణయం కాదని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఈ ప్రతిపాదిత అదనపు టారిఫ్‌ను వెనక్కి తీసుకోవాలని అమెరికాను కోరేందుకు భారత్ సిద్ధమవుతోంది.
Comments
Loading comments...

