వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్, డామన్‌లలో పర్యటించనున్నారు. సూరత్‌లో రోడ్డు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు చెందిన రూ.18,800 కోట్ల పైచిలుకు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందులో భాగంగా సూరత్‌లో 200 పడకల ఈఎస్‌ఐసీ ఆసుపత్రిని కూడా ప్రధాని ప్రారంభిస్తారు.
సాయంత్రం డామన్‌కు చేరుకుని రూ.2,970 కోట్ల విలువైన ప్రజాసంక్షేమ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే, ప్రాంతీయ వైమానిక అనుసంధానాన్ని పెంచే 'నమో' విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనంతో పాటు, 'నమో' ఆసుపత్రిని దేశానికి అంకితం చేయనున్నారు.
Comments
Loading comments...

