వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం బయట బహిరంగంగా ఐపీఎల్ మ్యాచ్ కాంప్లిమెంటరీ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చర్యల కోసం వారిని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు.
ఐపీఎల్ క్రేజ్‌ను ఆసరాగా చేసుకుని అక్రమంగా లాభాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సీపీ సుమతి ఆదేశాలతో పోలీసులు ప్రస్తుతం బ్లాక్ టికెట్ల విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
Comments
Loading comments...

