Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరులో సీట్లపై ఉత్కంఠ

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 11:40 AM ఏలూరుGeneral
ఉంగుటూరులో సీట్లపై ఉత్కంఠ - Udayam
ఉంగుటూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల సర్దుబాటుపై ఉత్కంఠ నెలకొంది. గణపవరం, ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలకు కూటమి నేతలు సన్నద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే జనసేనకు చెందినవారు కావడంతో ఆ పార్టీ ఎక్కువ సీట్లు ఆశిస్తోంది. టీడీపీ, బీజేపీలకు ఎన్ని సీట్లు కేటాయిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

Comments

G
Loading comments...