Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ చెట్లు.. ప్రమాద భయం

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 2:11 PM వికారాబాద్General
ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ చెట్లు.. ప్రమాద భయం - Udayam
వికారాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డు అయ్యప్ప స్వామి దేవాలయ ఆవరణలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ చెట్లు, విద్యుత్‌ తీగలు అలుముకోవడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఆలయానికి వచ్చే భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ శాఖ అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ పెరిగిన చెట్లను తొలగించి, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...