Udayam Digital
Menu

ట్రామా కేంద్రం లేక ప్రాణనష్టం

Shruthi Nov 25, 2026 8:36 AM హైదరాబాద్General
ట్రామా కేంద్రం లేక ప్రాణనష్టం - Udayam Digital
ప్రమాదాల్లో గాయపడిన వారికి గంటలోపు మెరుగైన వైద్యం అందించేందుకు మిర్యాలగూడలో ప్రకటించిన ట్రామా కేర్ కేంద్రం రెండేళ్లయినా కార్యరూపం దాల్చలేదు. దీంతో ఇటీవల వేములపల్లి వద్ద ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ఒక యువకుడు సకాలంలో చికిత్స అందక మృతి చెందాడు. న్యూరో, ఎముకలు, గుండె నిపుణులతో పాటు ఐసీయూ, బ్లడ్ బ్యాంక్ ఉండే ఈ కేంద్రాలు ఏర్పాటైతే క్షతగాత్రుల ప్రాణాలను కాపాడవచ్చని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...