వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్ 2026లో విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్‌ల మధ్య జరిగిన వివాదం నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులు తనను ఆన్‌లైన్‌లో వేధిస్తున్నారని హెడ్ భార్య జెస్సికా ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తనతో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర కామెంట్లు పెడుతున్నారని ఆమె ఆస్ట్రేలియా మీడియాతో పేర్కొన్నారు.
గతంలో వన్డే ప్రపంచ కప్, డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా గెలిచినప్పుడు కూడా ఇలాంటి వేధింపులు ఎదురయ్యాయని జెస్సికా గుర్తు చేశారు. గతంలో తమ చిన్న కుమార్తెను ఉద్దేశించి కూడా బెదిరింపులు వచ్చాయని ఆమె వాపోయారు.
Comments
Loading comments...

