తొమ్మిది నెలలకే చిన్నారికి ప్రపంచ రికార్డు

కొత్తవలసకు చెందిన కోట నవీన్‌కుమార్, ప్రిషిల్లా దంపతుల కుమార్తె అవీషి లియానా తొమ్మిది నెలల వయసులోనే అరుదైన ఘనత సాధించింది. తల్లిదండ్రుల సూచనలకు స్పందించడం, బొమ్మలను గుర్తించి తీసుకురావడం వంటి పనులను అలవోకగా చేస్తోంది.
ఈ ప్రతిభతో చిన్నారి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. తమ కుమార్తె విజయంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
