వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో తిరుమలలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోతున్నాయి. భక్తుల రద్దీ పెరగడంతో నిత్యం 60 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తుండగా, ప్రస్తుత నిల్వలు కేవలం 90 రోజులకే సరిపోతాయని టీటీడీ తెలిపింది.
కుమారధార, పసుపుధార డ్యామ్‌లలో నీరు పూర్తిగా ఖాళీ కాగా పాపవినాశనం, గోగర్భంలో మాత్రమే స్వల్ప నిల్వలున్నాయి. త్వరలోనే వర్షాలు కురుస్తాయని అధికారులు ఆశిస్తున్నారు.
Comments
Loading comments...

