వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను సోమవారం ఉదయానికి తీవ్ర తుపానుగా బలపడనుందని వాతావరణశాఖ తెలిపింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాములోగా నెల్లూరు, నరసాపురం మధ్య తీరం దాటే అవకాశముంది.
తీరం దాటేటప్పుడు గంటకు గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాలపై ప్రభావం పడనుంది. కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
Comments
Loading comments...

