వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరులో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు మధుసూదన్‌రావు (65), భార్య రత్నావళి (60), కుమారుడు సాయిసుకృత్ (25) ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వీరి బలవన్మరణానికి కుటుంబ కలహాలే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Loading comments...

