వార్తలకు తిరిగి వెళ్లండి

పూణే టీసీఎస్‌లో పని ఒత్తిడి, తోటి ఉద్యోగుల వేధింపులు భరించలేక అమిత్ బ్రహ్మే అనే 48 ఏళ్ల ఐటీ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నారు. తన ప్రాజెక్టులను లాగేసుకోవడమే కాకుండా, తన స్నేహితుడు వినోద్ పాలిచా, సహోద్యోగులు అవమానించారని సూసైడ్ నోట్‌లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల భద్రతపై గట్టి నిబంధనలు తీసుకురావాలని నైట్స్ (NITES) సంఘం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కొద్ది నెలల వ్యవధిలో ఒకే క్యాంపస్‌లో ఇద్దరు ఉద్యోగులు మరణించడం కలకలం రేపింది.
Comments
Loading comments...

