వార్తలకు తిరిగి వెళ్లండి

దౌల్తాబాద్ మండలం సుల్తాన్పూర్లో గ్రామస్థులు నవరాత్రి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. రాత్రివేళ విద్యుత్ దీపాలు, బాణసంచా కాంతుల నడుమ గ్రామమంతా పండుగ శోభ సంతరించుకుంది.
సంప్రదాయ దుస్తుల్లో మహిళలు, యువతులు ఉత్సాహంగా దాండియా, కోలాటం ఆడారు. జానపద పాటల లయకు అనుగుణంగా అడుగులు వేస్తూ సందడి చేశారు. గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
Comments
Loading comments...

