Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రుద్రం-2’ పరీక్ష విజయవంతం

Follow Udayam on Google
Deepak Chaurasia Jun 03, 2026 11:34 AM జాతీయంGeneral
‘రుద్రం-2’ పరీక్ష విజయవంతం - Udayam
భారత రక్షణ పరిశోధన సంస్థ (DRDO) స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ‘రుద్రం-2’ క్షిపణి పరీక్షను ఒడిశాలోని చాందీపూర్‌లో విజయవంతంగా పూర్తి చేసింది. శత్రు దేశాల రాడార్ వ్యవస్థలను, కమ్యూనికేషన్ కేంద్రాలను ధ్వంసం చేయడంలో ఈ యాంటీ రేడియేషన్ క్షిపణి కీలక పాత్ర పోషించనుంది. వాయుసేనలో గేమ్‌చేంజర్‌గా మారనున్న ఈ మిస్సైల్ శబ్దవేగం కంటే 5.5 రెట్లు వేగంతో ప్రయాణిస్తుంది. సుమారు 300 కిలోమీటర్ల దూరంలోని శత్రువుల క్షిపణి వ్యవస్థలను ఇది అత్యంత ఖచ్చితత్వంతో నాశనం చేయగలదు.

Comments

G
Loading comments...