Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బల్గేరియాతో బలపడుతున్న బంధం : ప్రధాని తో జైశంకర్ చర్చలు

Follow Udayam on Google
Karuna Jun 11, 2026 12:39 AM జాతీయంGeneral
బల్గేరియాతో బలపడుతున్న బంధం : ప్రధాని తో జైశంకర్ చర్చలు - Udayam
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ బల్గేరియాలో పర్యటించారు. ఆ దేశ ప్రధాని రుమెన్ రాదేవ్, విదేశాంగ మంత్రి వెలిస్లావా పెట్రోవాతో ఆయన ఉన్నతస్థాయి చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఏఐ, ఫార్మా, రక్షణ తదితర రంగాల్లో సహకారం పెంపొందించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించారు. మారుతున్న ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో భారత్-ఈయూ బంధం ప్రాముఖ్యతను జైశంకర్ వివరించారు. అనంతరం సోఫియాలోని చారిత్రక మ్యూజియాన్ని సందర్శించిన ఆయన, జూన్ 11న ఫిన్‌లాండ్ పర్యటనకు వెళ్లనున్నారు.

Comments

G
Loading comments...