Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమానంలో రూ.4 కోట్ల బంగారం పట్టివేత

Follow Udayam on Google
Nisha Jun 15, 2026 10:46 AM జాతీయంGeneral
విమానంలో రూ.4 కోట్ల బంగారం పట్టివేత - Udayam
అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీ స్మగ్లింగ్‌ను ఛేదించారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇండిగో విమానంలోని స్పీకర్ బాక్సులో దాచిన 2.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ.4.26 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విమానంలోని టాయిలెట్ స్పీకర్ బాక్సులో ప్లాస్టిక్ టేపులతో చుట్టిన బంగారు బిస్కెట్లను అధికారులు గుర్తించారు. ఎయిర్‌పోర్టులో నిఘా పెరగడంతో స్మగ్లర్లు బంగారాన్ని వదిలేసి పరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధికారులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...