వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి జిల్లా సరిహద్దుల మీదుగా అక్రమ పశువుల రవాణా కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎటపాక మండలం గుండాల-ఎర్రబోరు వద్ద ట్రాలీలో పశువులను కిక్కిరిసి తరలిస్తుండగా స్థానికులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు.
సరిహద్దుల్లో నిఘా లోపంతో అక్రమ రవాణా పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేసి గోవధ, అక్రమ పశువుల రవాణాను అరికట్టాలని కోరారు.
Comments
Loading comments...

