వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బుధవారం కుటుంబ సమేతంగా నందిగామ రూరల్ పరిధిలోని శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం శ్రీరఘురామ్ ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించానని, ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబు నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

