Udayam Digital
Menu

సోదరి పెళ్లి వేళ ప్రియుడి మోసం

Shruthi Nov 27, 2026 8:01 AM కడపGeneral
సోదరి పెళ్లి వేళ ప్రియుడి మోసం - Udayam Digital
కడపలో సోదరి వివాహం కోసం బంగారు నగలు తిరిగి ఇవ్వాలని ప్రియుడిని కోరిన యువతి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. కర్నూలుకు చెందిన దివ్య దీపిక (23) కడపలో బీపీటీ చదువుతోంది. హైదరాబాద్‌కు చెందిన సహ విద్యార్థి సంజయ్‌తో ప్రేమలో ఉన్న ఆమె.. సోదరి నగలను అతడికి ఇవ్వగా తాకట్టు పెట్టాడు. సోదరి వివాహం నిశ్చయం కావడంతో నగలు విడిపించాలని పలుమార్లు కోరినా సంజయ్ స్పందించలేదు.

Comments

G
Loading comments...