Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు జాబితాలో స్మృతి ఇరానీ పేరు గల్లంతు

Follow Udayam on Google
Anjali Jun 13, 2026 10:54 AM జాతీయంGeneral
 ఓటరు జాబితాలో స్మృతి ఇరానీ పేరు గల్లంతు - Udayam
అమేథీ జిల్లాలో మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేరు పంచాయతీ ఓటర్ల జాబితా నుంచి తొలగించబడటం సంచలనం సృష్టించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసిన స్మృతి పేరు, తాజాగా విడుదలైన జాబితాలో లేకపోవడంతో జిల్లా మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. లోక్‌సభ, అసెంబ్లీ ఓటర్ల జాబితాలో ఆమె పేరు యథావిధిగా ఉంది. ఈ ఘటనపై స్పందించిన బీజేపీ నేతలు, పేరును మళ్లీ చేర్చాలని దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. విచారణ అనంతరం తప్పులను సరిదిద్దుతామని అధికారులు హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...