Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెండి దిగుమతులపై కేంద్రం ఆంక్షలు

Follow Udayam on Google
Swati Chaturvedi Jun 03, 2026 3:25 PM జాతీయంGeneral
వెండి దిగుమతులపై కేంద్రం ఆంక్షలు - Udayam
దేశంలో పెరుగుతున్న వెండి దిగుమతులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆంక్షలు విధించింది. ఇకపై బ్యాంకులు, ఆర్‌బీఐ ఏజెన్సీలతో సహా ఏ సంస్థ అయినా వెండిని దిగుమతి చేసుకోవాలంటే విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (డీజీఎఫ్‌టీ) నుంచి తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలని స్పష్టం చేసింది. పశ్చిమాసియా సంక్షోభం వల్ల విదేశీ మారక నిల్వలపై పడుతున్న ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏప్రిల్‌లో వెండి దిగుమతులు ఏకంగా 157 శాతం పెరగడంతో, నిబంధనలను కఠినతరం చేస్తూ కేంద్రం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

Comments

G
Loading comments...