వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తొలిరోజు భ్రమరాంబికాదేవి శైలపుత్రీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు.
స్వామి అమ్మవార్ల గ్రామోత్సవంలో కోలాటాలు, చెక్కభజనలు, కేరళ, గిరిజన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆలయ చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు, ఈవో దంపతులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

