వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు రోజుల్లో 1,700 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, గురువారం మధ్యాహ్నం కేవలం 75 నిమిషాల్లోనే 500 పాయింట్లు పతనమైంది. శుక్రవారం మొహర్రం సందర్భంగా మార్కెట్లకు సెలవు కావడంతో ఇన్వెస్టర్లు ముగింపు దశలో లాభాల స్వీకరణకు (Profit Booking) మొగ్గు చూపారు.
ఆటోమొబైల్ షేర్లు రాణించగా, గ్లోబల్ మార్కెట్లో మెటల్ ధరలు తగ్గడంతో హిందాల్కో వంటి మెటల్ షేర్లు, క్రూడాయిల్ ప్రభావంతో ఓఎన్‌జీసీ నష్టపోయాయి. మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీలు కూడా నష్టాల్లో ముగిశాయి.
Comments
Loading comments...

