Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సడన్‌ బ్రేక్‌తో రోడ్డుపై పడిన పైపులు

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:52 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
సడన్‌ బ్రేక్‌తో రోడ్డుపై పడిన పైపులు - Udayam
బూర్గంపాడు మండలం సారపాకలో గురువారం ఉదయం ప్రమాదం తప్పింది. పాల్వంచ నుంచి భద్రాచలం వెళ్తున్న బొలేరో ట్రాలీ పీఎం6 గేట్‌ వద్ద సడన్‌ బ్రేక్‌ వేయడంతో వాహనంలో సరిగా బిగించని జీఏ యాంగ్లర్‌ లోడ్‌ పైపులు రోడ్డుపై పడ్డాయి. ఆ సమయంలో కార్మికులు విధులకు వెళ్తుండటంతో తృటిలో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.

Comments

G
Loading comments...