Back to feed
హైవేపై కారును ఢీకొట్టిన స్కూల్ బస్సు
Sai kumar Jun 12, 2026 9:42 AM ప్రకాశం 12 views3 days ago

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల సమీపంలోని మార్కాపురం ఒంగోలు హైవేపై శుక్రవారం మధ్యాహ్నం ఒక కారు, స్కూల్ బస్సు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘోర రహదారి ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందిన వెంటనే ఎస్సై శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Loading comments...

