Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేల తల్లిని కాపాడుకుందాం

Follow Udayam on Google
పవన్ కుమార్ Jun 26, 2026 3:00 PM జాతీయంGeneral
నేల తల్లిని కాపాడుకుందాం - Udayam
రసాయన ఎరువులు, పురుగుల మందుల మితిమీరిన వాడకం వల్ల సాగు భూములు నిస్సారంగా మారుతున్నాయని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆందోళన వ్యక్తం చేశారు. విపరీతమైన రసాయనాల వాడకంతో నేల తల్లి అనారోగ్యానికి గురవుతోందని ఆయన పేర్కొన్నారు. భూసార పరీక్షలు నిర్వహించి, పంటలకు అవసరమైన పోషకాలను మాత్రమే అందించాలని పిలుపునిచ్చారు. పెట్టుబడి ఖర్చులను సగానికి పైగా తగ్గించుకునేందుకు రైతులంతా సాంప్రదాయ సహజ వ్యవసాయం వైపు మళ్లాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...