Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరు బ్రిడ్జి వద్ద యథేచ్ఛగా ఇసుక దోపిడీ

Follow Udayam on Google
Rohit Varma Jun 12, 2026 5:20 PM కడపGeneral
ఏటూరు బ్రిడ్జి వద్ద యథేచ్ఛగా ఇసుక దోపిడీ - Udayam
కమలాపురం, ఖాజీపేట మధ్య ఏటూరు బ్రిడ్జి వద్ద నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ అక్రమార్కులు జేసీబీలు, ట్రాక్టర్లతో యథేచ్ఛగా ఇసుక, మట్టిని తరలిస్తున్నారు. బహిరంగంగా జరుగుతున్న ఈ అక్రమ దందాపై స్థానిక అధికారులు మామూళ్ల మత్తులో ఉండి పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ దోపిడీ కారణంగా నదీ తీర ప్రాంతాలు దెబ్బతినే ప్రమాదముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ అక్రమ రవాణాను అడ్డుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...