Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రూ.2.5 లక్షల లంచం.. ముగ్గురు అరెస్ట్‌

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 5:47 PM హైదరాబాద్General
రూ.2.5 లక్షల లంచం.. ముగ్గురు అరెస్ట్‌ - Udayam
మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసరలో రూ.2.50 లక్షల లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్‌ సందీప్‌రెడ్డి, వీఆర్‌ఏ విజయ్‌ కుమార్‌,రికార్డు అసిస్టెంట్‌ బాలకృష్ణ ఏసీబీకి పట్టుబడ్డారు. మ్యుటేషన్‌,భూ సర్వే పనుల కోసం మొత్తం రూ.5 లక్షలు డిమాండ్‌ చేసినట్లు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో కీసర తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ వ్యవహారంలో మరెవరి పాత్రైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...