Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డుపై పులి: బైక్‌లకు నో!

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 9:12 PM జాతీయంGeneral
రోడ్డుపై పులి: బైక్‌లకు నో! - Udayam
అరుణాచల్ ప్రదేశ్‌లోని రోయింగ్-అనిని రహదారిపై రాయల్ బెంగాల్ పులి సంచరిస్తుండటంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. దిగువ దిబాంగ్ వ్యాలీ జిల్లా పరిధిలోని 4 కిలోమీటర్ల మేర ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో బైక్‌లపై ప్రయాణించవద్దని, వాహనాల నుంచి కిటికీలు తెరచి బయటకు రావద్దని స్థానికులకు, పర్యాటకులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

Comments

G
Loading comments...