వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లాలోని జీకేవీధి మండలం రంపుల ఘాట్‌లో వారం రోజుల క్రితం విరిగిపడిన కొండచరియలు, మట్టిపెళ్లలను అధికారులు ఇంకా తొలగించలేదు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
రక్షణ గోడలు లేకపోవడంతో వర్షాలకు బండరాళ్లు, మట్టి రహదారిపైకి జారిపడుతున్నాయి. రాత్రివేళ ప్రమాదం పొంచి ఉండటంతో అడ్డంకులను వెంటనే తొలగించాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

