వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి సభలో మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలోని అరాచకాలను గుర్తు చేస్తూ, 'రప్పా.. రప్పా' అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ పోతుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు పూర్తి స్వేచ్ఛ లభించిందని లోకేశ్ పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎన్నికల హామీలను నెరవేర్చుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని తెలిపారు. శ్రీ వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకుందని ఆయన వివరించారు.
Comments
Loading comments...

