Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్‌బీఐ కీలక నిర్ణయం: యథాతథంగానే వడ్డీ రేట్లు

Follow Udayam on Google
Sonia Singh Jun 05, 2026 10:39 AM జాతీయంGeneral
ఆర్‌బీఐ కీలక నిర్ణయం: యథాతథంగానే వడ్డీ రేట్లు - Udayam
రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా వరుసగా మూడోసారి కీలక రెపో రేటును 5.25 శాతం వద్దే స్థిరంగా ఉంచింది. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల తర్వాత ప్రస్తుత సమీక్షలోనూ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడం విశేషం. గతేడాది మాత్రం ఆర్‌బీఐ పలుమార్లు వడ్డీ రేట్లను తగ్గించింది. 2025లో వివిధ విడతలుగా మొత్తం 1.25 శాతం మేర కోత విధించగా, ప్రస్తుతం ద్రవ్యోల్బణ పరిస్థితులను బట్టి యథాతథ స్థితిని కొనసాగిస్తోంది. ఈ నిర్ణయంతో రుణాలు తీసుకున్న వారికి ప్రస్తుతానికి ఊరట లభించినట్లయింది.

Comments

G
Loading comments...