వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ రేజర్‌పే ఐపీఓకు సిద్ధమవుతోంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సుమారు రూ.5 నుంచి 6 వేల కోట్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఇప్పటికే సెబీకి కాన్ఫిడెన్షియల్ రూట్‌లో ముసాయిదా పత్రాలను సమర్పించినట్లు సమాచారం.
2014లో స్థాపించబడిన రేజర్‌పే, డిజిటల్ చెల్లింపుల విభాగంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఫోన్‌పే వంటి సంస్థలు కూడా ఐపీఓ బాటలో ఉన్న తరుణంలో, రేజర్‌పే ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. సెబీ అనుమతి వచ్చే వరకు వివరాలు గోప్యంగా ఉండనున్నాయి.
Comments
Loading comments...

