వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ: రాబోయే మూడు, నాలుగు రోజుల్లో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ పట్నాయక్ తెలిపారు. ప్రస్తుతం వీటి పురోగతి కాస్త నెమ్మదిగా సాగుతోందని ఆయన పేర్కొన్నారు.
జూలై మొదటి వారంలో బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనంతో రుతుపవనాలు మరింత బలపడనున్నాయి. దీని ప్రభావంతో ఉత్తర భారతదేశంలోని అత్యధిక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
Comments
Loading comments...

