Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రానున్న 3 గంటల్లో వర్షాలు: ఆరెంజ్ అలర్ట్

Follow Udayam on Google
Sanjeev Jun 13, 2026 4:14 PM అమరావతిGeneral
రానున్న 3 గంటల్లో వర్షాలు: ఆరెంజ్ అలర్ట్ - Udayam
రానున్న మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ఈ మేరకు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా నర్సీపట్నం, పాడేరు, బొబ్బిలి, పార్వతీపురం ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రయాణాల్లో ఉన్నవారు, బయట ఉన్నవారు చెట్లు, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ కింద నిలబడరాదని హెచ్చరించారు.

Comments

G
Loading comments...